కేతిరెడ్డి కోరిక త్వరలోనే తీరుస్తా: మంత్రి సత్యకుమార్ మాస్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-09-23 14:22:39.0  )
కేతిరెడ్డి కోరిక త్వరలోనే తీరుస్తా: మంత్రి సత్యకుమార్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇదీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Former Mla Kethireddy VenkataramiReddy) నిజస్వరూపమని మంత్రి సత్యకుమార్(Mla Satyakumar) అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram)లో కేతిరెడ్డి కారును అడ్డుకోబోయిన కూటమి కార్యకర్తను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు. గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని చెప్పారు. ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని సత్యకుమార్ హెచ్చరించారు.

కాగా వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి కారుపైకి ఎక్కేందుకు ఓ కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కారును వేగంగా నడిపారు. దీంతో కార్యకర్త కిందపడ్డారు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి కేతిరెడ్డి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed