- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం..!
దిశ, కళ్యాణదుర్గం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం కరిడిపల్లిలో ‘బాబు ష్యురిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు కనిపించాయని, అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు. ఏ గ్రామంలో చూసినా వైసీపీ ప్రభుత్వాన్ని చీదరించుకునే స్థాయికి వెళ్ళిందంటే పరిపాలన ఏవిధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసిపి అరాచకాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి సమిష్టిగా పోరాటం చేయాలని సూచించారు. టీడీపీ విజయానికి కృషి చేస్తూ సీఎంగా చంద్రబాబును గెలిపించుకుందామని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.