- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఉండదు.. తేల్చేసిన బీజేపీ కీలక నేత
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ కూడా రాబోతోంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే పొత్తుల ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇక వైసీపీ అయితే ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఆరు నెలలుగా చెబుతూనే ఉన్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీతో జనసేన కలిసింది. అయితే బీజేపీతో పొత్తు కొనసాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పలుమార్లు పేర్కొన్నారు.
తాజాగా ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు జరగబోతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో టీడీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి పని చేశారు. గత ఏడాది నుంచి తప్పుకున్నారు.
అయితే చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవడంతో తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీతో వైసీపీ కలవబోతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బీజేపీ ప్రభుత్వం అండగా ఉందని, వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటనే అభిప్రాయాన్ని కొందరు బీజేపీ, వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ, వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పొత్తులపై బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో పర్యటించిన ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. జగన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అలాంటి అవినీతి పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర పార్టీ నాయకత్వం చెప్పినట్లే తామంతా నడుకుంటామని సత్యకుమార్ పేర్కొన్నారు. కానీ జనసేనతో పొత్తు ఉందన్న విషయాన్ని ఆయన ప్రస్థావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.