- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డిపై కేసు
దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డిపై కేసు నమోదు అయింది. ధర్మవరం సబ్‌జైలు దగ్గర జరిగిన ఘటనలో కేతిరెడ్డితో పాటు అనుచరులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. BJP కార్యకర్త ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు జారీ నోటీసులు జారీ చేశారు.
కాగా వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి కారుపైకి ఎక్కేందుకు ఓ కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. దీంతో కార్యకర్త కిందపడ్డారు. స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. జైలు వెళే ఆలోచన ఉంటే కేతిరెడ్డిని త్వరలో ఆ పని చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చగా మారింది.