BREAKING: పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి

by Anjali |   ( Updated:2024-04-03 11:16:00.0  )
BREAKING: పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ వివాదం ఏపీ పాలిటిక్స్ ‌ను కుదిపేస్తుంది. ఏపీ సర్కారు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో లబ్దిదారులు ఉదయం నుంచి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లను పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ విధుల నుంచి ఈసీ తొలగించింది. సచివాలయాల వద్ద లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణ జిల్లా గంగూలురులో పింఛన్ కోసం వెళ్లిన 80 ఏళ్ల వజ్రమ్మ వడదెబ్బకు మృతి చెందింది. ఉదయం నుంచి ఎండ తట్టుకోలేక వజ్రమ్మ ప్రాణాలు విడిచింది.

Advertisement

Next Story