- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి మండపంలో దారుణం.. వరుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి
దిశ, వెబ్ డెస్క్: పెళ్లి మండపంలో దారుణం జరిగింది. వరుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో జరిగింది. తిరుపతికి చెందిన జయ అనే మహిళతో నందలూరుకు చెందిన సయ్యద్ పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే సయ్యద్‌కు కోడూరుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ రోజు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సయ్యద్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న జయ.. నందలూరులోని కల్యాణ మండపం వద్దకు వెళ్లారు. పెళ్లి జరుగుతుండగానే జయ తన వద్దనున్న యాసిడ్‌తో సయ్యద్‌పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సయ్యద్ తప్పించుకున్నారు. తన వద్దనున్న చాకుతో జయపై సయ్యద్ దాడి చేశారు. అయితే ఈ ఘటనలో సయ్యద్ పిన్నిపై యాసిడ్ పడి గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పెళ్లిమండపంలోనే ఈ ఘటన జరగడంతో సయ్యద్ వివాహం నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.