ఘనంగా జిల్లెళ్లమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలు

by sudharani |
ఘనంగా జిల్లెళ్లమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలు
X

దిశ, గుంటూరు: జిల్లాలోని బాపట్ల మండలం జిల్లెళ్లమూడి గ్రామంలో అమ్మ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు సభలో కొండముది సుబ్బారావు రచించిన 'అమ్మ చే ప్రభావితులు' అనే గ్రంథాన్ని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి మహాస్వామి, రావూరి ప్రసాద్ సేకరణలో వెలువడిన అమ్మతో అనుభవాలు-6,7,8 సంపుటాలను మాజీ మంత్రి శాసన మండల సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు.

సభాధ్యక్షులుగా విశ్వజనని పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మరకని దినకర్ వ్యవహరించారు. గ్రంథ సమీక్షలు దేశరాజు కామరాజు అమ్మచే ప్రభావితులు గ్రంథాన్ని సమీక్షించారు. గ్రంథకర్త కొండముది సుబ్బారావు తన స్పందనలో తన కలాన్ని నడిపించింది అమ్మ అని కొనియాడారు. భారతీయ యువ మోర్చా బీజేపీ సంఘ అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ దళిత వర్గాలను ఆదరించిన అమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని కాంక్షించారు.

అవతారమూర్తి అమ్మ

గౌతమీ విద్యాపీఠ విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు కందుకూరి సత్య సూర్య నారాయణ అమ్మ అన్నపూర్ణాదేవి అవతారాన్ని కొనియాడారు. డొక్కా మాణిక్య ప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ తత్వంలో మానవ సేవ పారాయణత్వం ఉందన్నారు. కార్యక్రమంలో గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి, అమ్మ తత్వ ప్రచార కమిటీ సభ్యురాలు ఉప్పుల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed