- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sharmila : అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు: షర్మిల ఫైర్

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ (BR Ambedkar)ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(Sharmila) మండిపడ్డారు. అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కేడర్ కు పిలుపునిస్తున్నామని తెలిపారు.
అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమని.. నిండు సభలో అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని అడగకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనన్నారు.
అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ అమిత్ షాతో బహిరంగ క్షమాపణలకు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల పేర్కొన్నారు.