- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ధైర్యంగా వెళ్లి ఓట్లు అడుగుతున్నామంటే కారణం అదే..! అంబటి..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని చాటుకునేందుకు అధికార పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఓ వైపు అధినేత సిద్ధం సభలతో బిజీ గా ఉంటె మరో వైపు పార్టీ నేతలు ప్రెస్ మీట్ లతో బిజీగా ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాలతో అధికారం లోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ సక్సెస్ ఫుల్ సీఎం అని.. అయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని.. కానీ టీడీపీ మాత్రం వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అబద్దాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు ఓ ఫెయిల్యూర్ సీఎం అని.. అందుకే అసత్యాలతో, అవాస్తవాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలిసి పని చేస్తాం..కలిసి పోటీ చేస్తాం అనే టీడీపీ, జనసేన ఇప్పటికీ సీట్ల కోసం కొట్టుకుంటున్నాయి పేర్కొన్నారు. ఇరు పార్టీల అధినేతలు భేటీలు కావడం, సీట్ల పైన చర్చించడం మామూలేనని.. వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేసరికి ఎన్నికలు కూడా ముగిసిపోతాయని ఎద్దేవ చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరేవేర్చడంతో తాము ధైర్యంగా వెళ్లి ప్రజలను ఓట్లను అడుగుతున్నామని తెలిపారు.