ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననే సొల్లు డైలాగులు ఎందుకు: Ambati Rambabu

by Hajipasha |   ( Updated:2022-08-23 13:29:40.0  )
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననే సొల్లు డైలాగులు ఎందుకు: Ambati Rambabu
X

దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుల మధ్య ట్విటర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నలకు కోట్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా నిలదీస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో 175 సీట్లలో పోటీ చేసే అంశంపై అంబటి రాంబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్‌ను నిలదీయగా అందుకు పీఏసీ సభ్యులు మెగాబ్రదర్ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మరోమారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌కు బాబుకు మధ్య డబ్బుల లావాదేవీలు జరిగాయని అందుకే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వను అని భారీ సొల్లు డైలాగ్‌లు చెప్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. వైకాపా విముక్తి ఆంధ్ర నా ధ్యేయం. ఎందుకీ భారీ సొల్లు డైలాగులు ? బాబు గారి దగ్గర నుండి అడ్వాన్స్ ముట్టిందని చెప్పొచ్చుగా!' అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.... వైసీపీ సోషల్ మీడియా మాత్రం తెగ ట్రోల్ చేస్తోంది. మరి అంబటి రాంబాబుకు జనసేన పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. మరి ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed