- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambati: ప్రజాగళంలో మైక్ మూగబోవడం వారి ఓటమికి సంకేతం: కూటమిపై మంత్రి అంబటి సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: చిలకలూరిపేట ‘ప్రజాగళం’ బహిరంగ సభలో మైక్ మూగబోవడం కూటమి ఓటమికి సంకేతమని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రధాని హాజరైన సభకు మైకును కూడా సరిచూసుకోలేని వారు ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారంటూ ఎద్దేవా చేశారు. చిలకలూరిపేట కూటమి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజాగళంలో కుర్చీలు అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయని కామెంట్ చేశారు. ఆ సభ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్ని కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల గుండెల్లో ఉంది జగనేనని అన్నారు.
Read More..
పిఠాపురం నుండే AP దశ మారుస్తా: పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు