బిగ్ బ్రేకింగ్: AP మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు కీలక పదవి

by Satheesh |   ( Updated:2024-06-14 09:17:26.0  )
బిగ్ బ్రేకింగ్: AP మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శుక్రవారం శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్ట్ కట్టబెట్టారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సత్యకుమార్ ఆరోగ్య శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, కొల్లు రవీంద్ర గనులు, ఎక్సైజ్ శాఖ, పొంగూరి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామానాయడు జలవనరుల శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఆనం నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, ఫరూఖ్‌కు న్యాయ శాఖ కేటాయించారు. నారా లోకేష్‌కు ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు.




Advertisement

Next Story

Most Viewed