Ap News: ఫోన్ ట్యాపింగ్ కలకలం...ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ

by srinivas |
Ap News:  ఫోన్ ట్యాపింగ్ కలకలం...ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ నాయకులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్ర చేసి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేత బోండా ఉమ బుధవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందని తెలిసే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అక్రమంగా వినడం అన్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో ఫోన్ల ట్యాపింగ్...


సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. ఇందుకు మంత్రులు ఇచ్చిన స్టేట్ మెంట్లే నిదర్శమన్నారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రె పార్టీ నాయకులు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కేంర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story