Nara Lokesh:‘ఆ క్రెడిట్ మొత్తం ప్రధాని మోడీదే’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-17 14:42:42.0  )
Nara Lokesh:‘ఆ క్రెడిట్ మొత్తం ప్రధాని మోడీదే’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) పూర్వవైభవం కోసం రూ.11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) కృతజ్ఞతలు తెలిపారు. మూతపడే స్థాయికి చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. ఉక్కు రెక్కల ఆయుధాలతో ఏపీ సరికొత్త శిఖరాలకు ఎదుగుతుందని, లక్షల మంది జీవితాలను మార్చుతుందని అన్నారు.

ప్లాంట్ కు పూర్వవైభవం తెచ్చేందుకు సహకరించిన మోడీకి(PM Narendra Modi) మొత్తం క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. వైజాగ్ ప్లాంట్‌ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి మద్దతుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed