నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-05 14:24:50.0  )
నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ?
X

దిశ,చీరాల: నియోజకవర్గ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి కేటాయించాలి అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేన తరఫున ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పేరు ప్రతిపాదిస్తుండగా టీడీపీ తరఫున నియోజకవర్గ సమన్వయకర్త కొండయ్య యాదవ్ డి.ఎస్.పి కొమ్మన బోయిన నాగేశ్వరావు యాదవ్ పేర్లు తో పాటు మరికొంత మంది అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సామాజిక కోణంలో యాదవుల కా చేనేత సామాజిక వర్గానికా అనేది తేల్చుకోలేక పోతుంది. జనసేన ఈసారి చీరాల తమకు కేటాయించాలని స్వాములు పేరును అనుహ్యంగా తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనేది టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు పార్టీ లో జనసేన తరపున టికెట్ కేటాయిస్తారని జనసేన పార్టీ వారు నమ్మకం పెట్టుకుంటే అభ్యర్థి ప్రకటిస్తుందని టీడీపీ నాయకత్వం గట్టిగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సోములు పేరును తెరపైకి తీసుకొచ్చి సీటు కేటాయించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి అభ్యర్థిపై చీరాల ప్రజలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ టిడిపి అభ్యర్థిగా ఎవరు ఉన్నారనే దానిపై కొత్త కొత్త పేర్లు చెప్పుకుంటూ రోజురోజుకు నియోజకవర్గంలో కొత్త పేర్లను తీసుకురావడంతో ఇక్కడ టీడీపీ జనసేన విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం టీడీపీ తరఫున నియోజకవర్గ సమన్వయకర్తగా కొండయ్య యాదవ్ ఉన్నారు గత మూడు సంవత్సరాలుగా కొండయ్య యాదవ్ సమన్వయకర్తగా పనిచేస్తూ టీడీపీ చేపట్టే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవంగా 2019లో ఇక్కడ టిడిపి నుంచి కరణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించారు.ఎమ్మెల్యే కరణం బలరాం నియోజకవర్గం లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. జనసేన పార్టీ తరపున ఆమంచి స్వాములు పేరు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది చీరాల నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తరఫున ఆమంచి స్వాములకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి బాధించినట్లు సమాచారం. అయితే టీడీపీ కూడా స్వాములు ఆర్థిక పరిస్థితి సామాజిక కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

గత ఏడాది ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరారు. చీరాలలో జనసేన పార్టీ తరఫున టికెట్ కేటాయిస్తే తనకే ఇస్తానని మాట కూడా తీసుకున్నట్లు తెలిసింది. అభ్యర్థుల విషయంలో టీడీపీ సందిగ్ధంలో పడుతూ జనసేన అభ్యర్థి పేరు తెరపైకి రావడం విశేషం. టీడీపీ అధిష్టానం తొలిసారి ఎలాగైనా చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం ను ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరడం పై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు బాపట్ల జిల్లా లో రా కదిలి రా బహిరంగ సభలో బలరాం పేరును ప్రస్తావిస్తూనే తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బలరాం కూడా చంద్రబాబు అదే స్థాయిలో విమర్శించడం చీరాల నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ తరుణంలో టీడీపీ యాదవ సామాజిక వర్గానికి కేటాయిస్తే బలరామును ఢీకొట్టే సత్తా ఉన్నట్లుగా సర్వేలు వెల్లడించినట్లు సమాచారం.


Read More..

‘పిఠాపురం గడ్డ నా అడ్డ.. పవన్ కల్యా్ణ్ పోటీ చేసినా నేనే గెలుస్తా’

Advertisement

Next Story