తెనాలి సీటుకి పోటీ పడుతున్న నేతలు.. అధినేతలదే తుది నిర్ణయం..ఆలపాటి

by Indraja |
తెనాలి సీటుకి పోటీ పడుతున్న నేతలు.. అధినేతలదే తుది నిర్ణయం..ఆలపాటి
X

దిశ వెబ్ డిస్క్: AP లో ఊపందుకుంటున్న పొత్తుల రాజకీయాలు. అయితే క్షేత్రస్థాయిలో గందరగోళాన్ని సృష్టిస్తోంది గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం. గతంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకొని కలిసిపోయామని చెప్పిన నేతలు ఇప్పుడు ఎవరికీ వారే ఎమునా తీరే అన్నట్లు ఎవరి ప్రచారం వారే చేసుకుంటున్నారు. సీటు మాకే వస్తుందంటే.. మాకే వస్తుందంటూ టీడీపీ నేతలు.. జనసేన సైనికులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం సీటు. ఈ సీటుకి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

దీంతో అటు నేతలే కాదు ఇటు ప్రజలు కూడా ఆ సీటు ఎవరిని వరిస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పై తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పందిస్తూ.. తెనాలి సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం అధినాయకత్వంకి వదిలి వేశామన్న ఆయన సీటు ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం చంద్రబాబు, పవన్ కలిసి తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే ఇద్దరిలో సీటు ఎవరికో చెప్పలేదని తెలిపిన ఆయన.. అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరం కలిసి పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story