- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court తీర్పుపై రివ్యూ పిటిషన్.. రాజధాని కేసులపై ఏజీ సమాధానం..
దిశ, ఏపీ బ్యూరో : అమరావతి రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును హైకోర్టులో దాఖలు చేసింది. అయితే రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, పురోగతి కూడా లేదని రైతుల తరపు న్యాయవాది మురళీధర్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ వేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పులో రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో.. దానిపై మాత్రమే ఎస్ఎల్‌పీ వేశామని.. హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని న్యాయవాది మురళీధర్ వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి ఎల్‌ఎల్‌పీ వేశారా అని ఏజీని త్రిసభ్యధర్మాసనం ప్రశ్నించింది. అయితే తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నట్లు ఏజీ త్రిసభ్య ధర్మాసనానికి తెలిపారు. అయితే సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ పెండింగ్‌లో ఉన్న సమయంలో .. హైకోర్టులో విచారణ సబబా ? అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పులో తాము కోరిన అంశాలు తిరస్కరించడంతో వాటిపై మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్లామని రైతుల తరపు న్యాయవాది మురళీధర్ ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతోనే హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేసినట్లు న్యాయవాది మురళీధర్ వెల్లడించారు.
- Tags
- High Court