- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aghori : అమరేశ్వర స్నానఘాట్ వద్ద అఘోరీ హల్చల్
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మహిళా అఘోరీ(Aghori) పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం(Amareswara Temple) స్నానఘాట్ వద్ద హల్చల్ చేశారు. అఘోరి అమరావతి కృష్ణానదిలోకి పుష్కర ఘాట్ వద్దకు నేరుగా కారులో వచ్చారు. కారు దిగకుండా కారుతో స్థాన ఘాట్ లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే అఘోరీ కారు నదీ తీరంలోని ఘాట్ మెట్ల వద్దకు చేరింది. పోలీసులు కారును అక్కడే ఆపివేశారు. మహిళా అఘోరీని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు అతిథి మర్యాదలతో అఘోరికి స్వామివారి దర్శనం చేయించారు. అఘోరీ అమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సనాతన ధర్మ పరిరక్షణ, లోక కల్యాణం కోసం దేశ పర్యటనలో భాగంగా అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తు్న్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని వరుసగా ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అమరేశ్వర ఆలయంలో తనను కలిసిన మీడియాతో అఘోరీ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ, లోక కల్యాణం కోసం తాను హిమాలయాల నుంచి జన సంచారంలోకి రావడం జరిగిందన్నారు. హిందు దేవాలయాలపై దాడులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆపేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, అటువంటి వారికి కోసి కారం పెడుతామని హెచ్చరించారు.