- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Aghori : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైన అఘోరి
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళా అఘోరీ (Aghori) ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam)లో ప్రత్యక్ష మయ్యారు. కార్తీక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలను వరుసగా సందర్శిస్తున్న అఘోరీ శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అఘోరీ దిగంబరంగా స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేయగా ఆలయ అధికారులు అడ్డుకున్నారు. వస్త్ర ధారణ లేకుండా దర్శనానికి అనుమతించేది లేదని ముఖద్వారం వద్ద అఘోరిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వస్త్రధారణ చేసుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి అఘోరీ ఆలయంలోకి వెళ్ళారు. ఆలయానికి చేరుకున్న అఘోరీని భక్తులు ఆసక్తగా చూశారు. కొందరు ఆమె ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు.
మహిళా పోలీసులు, ఆలయ సిబ్బంది ఆమెకు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు గురువుల ఆదేశానుసారం దేశంలో పర్యటిస్తున్నానని, మహిళలు, చిన్నారులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు నివారించబడేందుకు, లోక కల్యాణం కోసం తాను కృషి చేస్తున్నానన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శిస్తున్నానని తెలిపారు.