తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సమీక్ష

by Mahesh |
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి పేరుగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలల్లో భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే ప్రత్యేక సందర్భాల్లో లక్షల్లో భక్తులు తిరుపతి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ఇలాంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కాగా ఈ సంవత్సరం నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న గరుడసేవ నిర్వహించనున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో ప్రకటించారు. కావున ఈ సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇది గమనించగలరు అని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed