Bandla Ganesh: కర్మ కాకపోతే ఇంకేంటి?..బీజేపీ-టీడీపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు

by srinivas |
Bandla Ganesh: కర్మ కాకపోతే ఇంకేంటి?..బీజేపీ-టీడీపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. సినీ నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్‌ రాజకీయ ఆరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాజకీయాలు కలిసిరాకపోవడంతో ఇక తాను రాజకీయాలజోలికి వెళ్లనని తెగేసి చెప్పేశారు. అయినప్పటికీ ఆయన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపైనా..పొత్తులపై బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా చంద్రబాబు పేరు చెప్పకుండానే ఘాటైన విమర్శలు చేశారు. ‘కర్మ కాకపోతే ఇంకేంటి. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి. ఆయన బీజేపీ అంటే బీజేపీ అనాలి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనెంట్‌గా ఏ పేరు చెప్తే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు. ఇంతకంటే ఏం కావాలి, దరిద్రం’ అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను పలువురు స్వాగతిస్తుంటే అటు టీడీపీ ఇటు బీజేపీ నేతలు మాత్రం స్వాగతించడం లేదు. విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల జోలికి రానన్నావు కదా నీకెందుకు ఇవన్నీ అంటూ సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే సరైన ట్వీట్ చేశావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed