- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. 14కు చేరిన మృతులు
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 50 దాకా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఎసెన్సియా ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో అక్కడిక్కడే ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరి పడటంతో వారి దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదం జరిగినపుడు కంపెనీలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్టు సమాచారం. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దానికి ప్రాణభయంతో కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండవచ్చు అనే అనుమానంతో భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.