బిగ్ బ్రేకింగ్: ఏపీ అసెంబ్లీ నుండి అచ్చెన్నాయుడు సస్పెండ్.. వీడియో తీయడంతో స్పీకర్ యాక్షన్..!

by Satheesh |   ( Updated:2023-09-22 06:20:34.0  )
బిగ్ బ్రేకింగ్: ఏపీ అసెంబ్లీ నుండి అచ్చెన్నాయుడు సస్పెండ్.. వీడియో తీయడంతో స్పీకర్ యాక్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీ అసెంబ్లీ నుండి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీయడంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయడు, ఎమ్మెల్యే అశోక్‌లను ఈ సెషన్ మొత్తానికి స్పీకర్ సభ నుండి సస్పెండ్ చేశారు. ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో విజిల్స్ ఊదుతూ ఆందోళన చేస్తున్నారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది.

రెండవ రోజు సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు.

సభ ప్రారంభం అయిన నిమిషాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో వైసీపీ మంత్రులు మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రులు అంబటి, బుగ్గన టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని.. అసెంబ్లీ అని ఫైర్ అయ్యారు.

చర్చకు తాము సిద్ధం.. సహకరించాలని టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. టీడీపీ సభ్యులు ఆందోళన.. మంత్రుల కౌంటర్‌లతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభంకాగానే.. మళ్లీ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది.


Read More..

బిగ్ బ్రేకింగ్: మొదలైన నిమిషాల్లోనే ఏపీ అసెంబ్లీ వాయిదా.. సభలో తీవ్ర గందరగోళం

Advertisement

Next Story

Most Viewed