ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

by sudharani |
ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
X

దిశ, శ్రీశైలం : శ్రీశైలం శిఖరం సమీపంలోని దోర్నాల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, స్కూటీ ఎదురెదురుగా ఢీ కొనడంతో.. బొలెరో వాహనం పక్కన ఉన్న డివైడర్‌ని ఢీకొనడంతో వెంకటేష్ (35) అనే వ్యక్తికి రోడ్డు సైడ్ ఉన్న ఇనుప రాడ్డు పొట్టలో గుచ్చుకుని అక్కడిక్కడే మృతి చెందాడు. అంతే కాకుండా స్కూటీపై ఉన్న శ్రీశైలం శ్రీస్వామివారి ఆలయ అర్చకుడు శివనాగప్రసాద్ (45) చెట్లలోకి దూసుకెళ్లి మృతిచెందాడు. బొలెరో వాహనంలో ఉన్న ఆరుగురికి గాయాలు కావడంతో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. బొలెరో వాహనం మాచర్ల నుండి దర్శనార్థం శ్రీశైలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి బొలెరో వాహనం అతివేగమే కారణమని దోర్నాల పోలీసులు భావిస్తున్నారు. శ్రీస్వామివారి ఆలయ అర్చకుడు ప్రమాదంలో మరణించడంతో దేవస్థానం అర్చకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బొలెరో వాహనం అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొన్నట్లు పలువురు ప్రయాణికులు కూడా చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దోర్నాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story