గుడిలో గోల్‌మాల్ నిజమేనా.!

by Mahesh |
గుడిలో గోల్‌మాల్ నిజమేనా.!
X

దిశ, అన్నవరం: అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులు రూ.16 లక్షలు గోల్‌మాల్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే. కోరుకొండ దేవస్థానంలో అన్నదానం విభాగంలో భక్తుల నుంచి సేకరించిన విరాళాలు సుమారు రూ.16 లక్షలు పక్కదారి పట్టించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. గోల్ మాల్ వెనుక అన్నవరం దేవస్థానం ఉద్యోగులు సతీష్, టి.అనిల్ కుమార్, ఆర్.రవికుమార్ ఉన్నారని భావించడంతో వారిని ఈఓ రామచంద్ర మోహన్ ఇటీవల సస్పెండ్ చేశారు.

ముమ్మరంగా ఆడిట్..

విరాళాలు పక్కదారి పట్టడంపై తలుపులమ్మ లోవ దేవస్థానం సహాయ కమిషనర్ విశ్వనాథరాజును విచారణ అధికారిగా అన్నవరం ఈవో రామచంద్ర మోహన్ నియమించారు. నెల రోజుల కిందట జరిగిన ఈ విషయంపై విశ్వనాథరాజు కోరుకొండ దేవస్థానానికి వెళ్లి అక్కడ నగదు పక్కదారి పట్టిన అంశాలపై విచారణ నిర్వహించారు. ప్రస్తుతం ముగ్గురు ఉద్యోగులు అధికారులకు సమర్పించిన బిల్లులకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని, నగదు పక్కదారి పట్టలేదని ఋజువు అయితే తప్ప ఈ ముగ్గురు ఉద్యోగులు మళ్లీ విధులకు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. విచారణాధికారి సమర్పించిన నివేదికను బట్టి ఈఓ రామచంద్ర మోహన్ చర్యలు తీసుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed