అక్కడ తంతే కానీ మోక్షం కలగదట .. తన్నించుకోవడానికి బారులు తీరిన భక్తులు.. ఎక్కడంటే..?

by Disha Web Desk 10 |
అక్కడ తంతే కానీ మోక్షం కలగదట .. తన్నించుకోవడానికి బారులు తీరిన భక్తులు.. ఎక్కడంటే..?
X

దిశ, ఫీచర్స్: కర్నూలు జిల్లా అరూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున శివపార్వతుల ఉత్సవమూర్తులను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కల్యాణం నిర్వహిస్తారు. అయితే, ఇక్కడ ఓ వింత ఆచారం పాత కాలం నుంచి కొనసాగుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివ భక్తుడు. 500 వందల ఏళ్ల ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రతి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతురు లో కూడా అలాగే మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించే వాడని భక్తులు చెబుతున్నారు.

వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిషులం ను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని కోపంతో నాట్యం చేస్తు భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. అలా స్వామి వారి కాలితో తన్నులు తిన్న వారికి మోక్షం కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటి కి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను ఇప్పటికి పాటిస్తున్నామని చెబుతున్నారు. ఇది చూసిన నెటిజెన్స్ తంతే తన్నారు కానీ.. కొంచం గట్టిగా తన్నండంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed