PSPK: పవన్ కల్యాణ్ ‘ది ట్రెండ్ సెట్టర్’.. మరోసారి ప్రూవ్ చేసిన డిప్యూటీ సీఎం

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-04 13:03:14.0  )
PSPK: పవన్ కల్యాణ్ ‘ది ట్రెండ్ సెట్టర్’.. మరోసారి ప్రూవ్ చేసిన డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా’ అని గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) చెప్పిన డైలాగ్ ఎంత పాపురల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. సినిమాల్లోనే నిజజీవితంలో కూడా ఆయన ట్రెండ్‌ సెట్టర్ అని నిరూపించారు. తాజాగా వైరల్ అవుతున్న ‘సీజ్ ద షిప్’(Seize the Ship) డైలాగే అందుకు నిదర్శనం. దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాదు.. ఓ నిర్మాత ఏకంగా మూవీ టైటిల్‌(Movie title)గా రిజిస్ట్రర్ చేసుకున్నారు. బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌లో రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇటీవల కాకినాడ పోర్ట్‌(Kakinada Port)లో రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవడమే కాకుండా.. షిప్‌ను సీజ్ చేయించడం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.





Also Read:

Kakinada: పవన్ కల్యాణ్ పర్యటన ఎఫెక్ట్.. కాకినాడ డీసీఎస్‌ఓ ప్రసాద్‌పై చర్యలు


Advertisement

Next Story