ఎమ్మిగనూరులో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మెగా కవాతు

by Javid Pasha |
ఎమ్మిగనూరులో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మెగా కవాతు
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో మెగా కవాతు నిర్వహించింది. హైదరాబాద్ కు చెందిన 1999, బెటాలియన్ బ్యాచ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఆయుధాలతో ఫాల్కన్ వాహనంతో కవాతు నిర్వహించారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ప్రజా రక్షణ కోసం ముందస్తుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని డిప్యుటీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ బాఘెల్ తెలిపారు. ఈ మార్చ్ ఫాస్ట్ లో రూరల్, అర్బన్ సీఐలు మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి, గ్రామీణ ఎస్సై నిరంజన్ రెడ్డి, పట్టణ ఎస్సై మస్తాన్ వలీ, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story