Ap: ఎదురుగా గేదెలు.. సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి..?

by srinivas |   ( Updated:2025-03-09 10:39:22.0  )
Ap: ఎదురుగా గేదెలు.. సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి..?
X

దిశ, వెబ్ డెస్క్: గూడ్స్ రైలు(Goods Train)కు పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై స్పీడుగా వెళ్తుండగా పట్టాలు తప్పింది. గేదెలు ఒక్కసారిగా అడ్డురావడంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశారు. దీంతో గూడ్స్ వ్యాగన్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకున్నాయి. వెంటనే రెండు వ్యాగన్లు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అంతేకాదు ట్రాక్ పక్కనే ఉన్న ప్రొక్లెన్‌ అద్దాలకు కంకరరాళ్లు తగిలాయి. ఈ ఘటనలో ప్రొక్లెన్‌లో ఉన్న యువకుడి తలకు గాయాలయ్యాయి.

ఈ ఘటన నంద్యాల జిల్లా గాజులపల్లె ఆర్ఎస్ గ్రామం(Nandyal District Gajulapalle RS Village) వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో మరమ్మతులు చేస్తున్నారు. గూడ్స్ వ్యాగన్‌ను రైలు ట్రాక్‌పై పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గేదెలు అడ్డురావడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులకు స్థానికులు తెలిపారు. దీంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. రైల్వే ట్రాక్‌ దాటించే సమయంలో గేదెల వెంట కాపరులు ఉండాలని, లేనిపక్షంలో రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

అలా లేకుండా గేదెల వల్ల ప్రమాదాలు జరిగే యజమానులే బాధ్యులని తెలిపారు. గూడ్స్ ట్రైన్ కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని, సాధారణ రైలు అయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఆలస్యానికి చింతిస్తున్నామని, మర్మమతులు పూర్తి అయిన తర్వాత రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Next Story