- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రన్న సమర్థతకు సజీవ సాక్ష్యం...చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం!
దిశ, డైనమిక్ బ్యూరో : జగన్మోసపురెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదనడానికి నిలువెత్తు నిదర్శనం చింతలపూడి ఎత్తిపోతల పథకం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా మెట్టప్రాంతంలో రైతులకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విస్తరణ పనులను శరవేగంతో పరుగులు తీయించిన దార్శనిక నేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ పథకం ద్వారా రెండుజిల్లాల్లోని 33మండలాల్లో 4.80లక్షల ఎకరాలకు నీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.4909 కోట్ల అంచనాలతో పనులు చేపట్టి, అధికారం నుంచి వైదొలగేనాటికి రూ.2289 కోట్లు ఖర్చుచేశాం అని లోకేశ్ గుర్తు చేశారు. ప్రాజెక్టు విస్తరణకు భూసేకరణ సమయంలో నిర్వాసిత రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను రెచ్చగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు అని విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు... ఉన్న ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక పాడుబెడుతున్నారు. విధ్వంసకుడు జగన్ అరాచకానికి, చేతల మనిషి చంద్రన్న సమర్థతకు అద్దం పడుతోంది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని నారా లోకేశ్ అన్నారు.