సైకో ప్రభుత్వానికి బుద్ది చేప్పే నాయకుడు వచ్చారు..నరసన్నపేట ఇంచార్జ్

by Indraja |
సైకో ప్రభుత్వానికి బుద్ది చేప్పే నాయకుడు వచ్చారు..నరసన్నపేట ఇంచార్జ్
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు నరసన్నపేట నియోజకవర్గంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ రమణమూర్తి మాట్లాడుతూ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించిన సైకో ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు నాయకుడు వచ్చారు అని లోకేష్ ను కొనియాడారు.

ఇక నారా లోకేష్ 3000 కిలో మీటర్లకు పైచీలుగా పాదయాత్ర చేశారని.. అయితే అది చూసి ఓర్వలేక, భయంతో పిరికిపంద చర్యగా నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు అని మండిపడ్డారు. ఓ వైపు పాదయాత్ర, మరో వైపు శంఖారావం పూరించి పార్టీని బలోపితం చేస్తున్నారని.. తండ్రికి తగ్గ తనయుడిని.. విషన్ ఉన్న నాయకుడని లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

టీడీపీ కట్టిన ఆసుపత్రులకు వైసీపీ వాళ్ళ రంగులు వేసుకుంటోందని, అలానే టీడీపీ కట్టిన ప్రాజెక్టులకు వైసీపీ శంకుస్థాపన చేసి వాళ్ళ బొమ్మలు వేసుకుంటోందని మండిపడ్డారు. వైసీపీ కొత్తగా చేసింది ఏమి లేదని విమర్శించారు. రాంమోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, రవికుమార తామంతా కలిసి సారవకోట మండలం లో కరుకాటకాలతో పంటలు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబును కోరితే 180 కోట్లతో ఎత్తిపోతల పతంకం మంజూరు చేయడమే కాకుండా .. 64 % పనులు పూర్తి చేసారని తెలిపారు.

కానీ గడిచిన 5 ఏళ్లలో కనీసం అరశాతం పనుల కూడా పూర్తిన్ చెయ్యలేని అసమర్ధుడు, దద్దమ్మ నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కష్టాల గురించి తెలియదా అని వైసీపీని ప్రశించారు. రైతుల గురించి పట్టించుకోని పనికిమాలిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed