- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ వరకు సతీష్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ-1గా ఉన్న సతీష్‌ను అడ్వొకేట్ సమక్షంలోనే విచారించాలని షరతు విధించింది. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన అంశాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది.
కాగా, జగన్ రాళ్ల దాడి కేసులో ప్రధాన నిందితుడి సతీష్‌ను కేసుకు సంబంధించి మరింత విచారించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విని.. పోలీసులు అడిగిన వారం రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. సతీష్‌ను పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోనని ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.