- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇళ్ల పరిసరాల్లో భారీ కొండ చిలువ..కొట్టి చంపిన జనం

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం నియోజకవర్గం మాచర కొత్తకాలనీలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి భారీ ఖాయంతో ఉన్న 5 అడుగుల కొండచిలువ జనావాసాల్లోకి వెళ్లింది. వీధుల్లో ఉన్న తుప్పల పొదల్లో నుంచి ఒక్కసారిగా రావడంతో జనాలు హడలిపోయారు. దీంతో కొండ చిలువను చూసి బెంబేలెత్తిపోయారు. కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. తమ గ్రామంలో తుప్పలు, పొదలు, చెత్త పేరుకుపోయి ఉండటం, విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో పాములు, కొండచిలువలు వస్తున్నాయని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరారు.
Next Story