ప్రియురాలు ఎడబాటు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు

by sudharani |   ( Updated:2023-05-11 14:23:37.0  )
ప్రియురాలు ఎడబాటు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సామర్లకోటలో పురుగుల మందు తాగి గోపాల కృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు గోపాల కృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను ఏసమ్మ అనే మహిళతో ఐదేళ్లుగా సహా జీవనం చేస్తున్నట్లు ఆ వీడియోలో వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా ఏసమ్మ తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు. అంతేకాదు కుటుంబ సభ్యులు అవమానించారని సెల్ఫీ వీడియోలో విలపించాడు.

అనంతరం గోపాలకృష్ణ పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు ఇతర బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గోపాల కృష్ణ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే గోపాల కృష్ణ సామర్లకోటలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

సైకో కిల్లర్.. మార్నింగ్ పేపర్లు ఏరుకోవడం.. రాత్రికి హత్యలు చేయడం

Advertisement

Next Story

Most Viewed