డేటింగ్ పేరుతో బడా మోసం.. రూ. 28 లక్షలు కొట్టేసిన ముగ్గురి అరెస్ట్

by srinivas |
డేటింగ్ పేరుతో బడా మోసం..  రూ. 28 లక్షలు కొట్టేసిన ముగ్గురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: డేటింగ్ యాప్ పేరుతో విశాఖలో బడా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్ట్రా‌గ్రామ్‌లో ఫైక్ ఐడీతో నగరానికి చెందిన యువకుడిని ట్రాప్ చేశారు. మాయ మాటలు చెప్పి రూ. 28 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని యువతీ, యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అపరిచిత కాల్స్, లింకులు, ఇతర అప్లికేషన్లు వస్తే క్లిక్ చేయొద్దని తెలిపారు. సైబర్ నేరాలపై తమకు సమాచారం అందించాలని చెప్పారు. 1930, 949336633కు సంప్రదించాలని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story