- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
21 నిమిషాల్లో 2.5లక్షల టికెట్లు హాంఫట్: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. వైకుంఠ ద్వారదర్శనం కోసం తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300 టికెట్లను విడుదల చేసింది. టికెట్లు ఇలా విడుదల చేశారో లేదో ఏకంగా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. టికెట్లు విడుదల చేసిన 21 నిమిషాల్లోనే 2.25 లక్షలు అమ్ముడైపోయాయి. టికెట్లు విడుదల చేసిన 14 నిమిషాల వ్యవధిలోనే 80శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. ఈ టికెట్ల విక్రయాల ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఇకపోతే టీటీడీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సాయంత్రం 5 గంటలకు గదుల కోటాను సైతం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.