- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు కంటైనర్లలో 2 వేల కోట్లు.. ఎవరివో నిర్ధారించిన పోలీసులు
by Anjali |
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తీసుకెళ్తున్న రూ. 2 వేల కోట్లను పోలీసులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అంత డబ్బును ఒకేసారి కనిపించడంతో పోలీసులు ఆ డబ్బు ఎక్కడిది ఎక్కడకు తీసుకెళ్తున్నారనే దర్యాప్తు చేశారు. కాగా నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న రూ. 2 వేల కోట్లు ఆర్బీఐకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును ఒక్కో కంటైనర్ లో 500 కోట్ల చొప్పున మొత్తం నాలుగు కంటైనర్లలో వివిధ బ్యాంకులకు చెందినదిగా అధికారులు తెలిపారు. అలాగే ఆ డబ్బును కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి తరలిస్తున్నారని వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు వెరిఫికేషన్ తర్వాత.. డబ్బు ఉన్న కంటైనర్లను రిలీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story