తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. మొత్తం 37 మంది మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 15:21:26.0  )
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. మొత్తం 37 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రెండు రాష్ట్రాల్లో ఇంకా పలు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. విజయవాడ, ఖమ్మంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా జలదిగ్బంధంలో వేల మంది ప్రజలు చిక్కుకుపోయారు. ప్రస్తుతం NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలా ఉండగా.. మొత్తంగా ఈ వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 20 మంది మృతి, తెలంగాణలో 17 మంది మృతిచెందారు.

ప్రస్తుతం 176 పునరావాస కేంద్రాల్లో 41,927 మంది వరద బాధితులు ఉన్నారు. ఏపీలో 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. మనుషులతో పాటు ఏపీలో వరదలకు 136 పశువులు, 59,700 కోళ్లు మృతి చెందాయి. 1,808 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. 1,72,542 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం కలిగింది. ఇంకా వరద ముంపులోనే ఖమ్మంలోని పలు కాలనీలు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed