- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: అధికారక పార్టీకి భారీ షాక్.. టీడీపీలోకి వైసీపీక 14కుటుంబాలు
దిశ, పుట్టపర్తి: వైసీపీ ప్రభుత్వంతో ఏ మాత్రం న్యాయం జరగదనీ భావించి కొండక మార్ల పంచాయతీకి చెందిన 14వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం బుక్కపట్నం మండలంలోని పాముదుర్తి పంచాయతీ లో నిర్వహించిన జయహో బిసి సమావేశంలో పలు కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి.
పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొండక మార్ల పంచాయతీలో ఇమ్రాన్ మురళి నాగరత్నం గజ్జిబండ తండాకు చెందిన జయ నాయక్, ప్రసాద్ నాయక్, చంద్ర నాయక్, వెంకటేష్ నాయక్, రాజు నాయక్ ,ముడవత్ మంగమ్మ బాయి, కుమావత్ శాంతమ్మ, లక్ష్మీదేవి బాయి, శాంతి బాయి, సాకే బాయీలు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం టీడీపీ అధికారంలోకి రావాలని ఇక్కడ ఎమ్మెల్యేగా పల్లె సింధూర రెడ్డి ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల కన్వీనర్ జయచంద్ర రాజారెడ్డి, డాక్టర్ పొగాకు జాకీర్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, అంజినప్ప, వాల్మీకి నాయకుడు కొండే ఈశ్వరయ్య ఇర్షాద్ ఖాన్ శాన్వాజ్ టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.