- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 155 సీట్లు పక్కా : ఎంపీ రఘురామ కృష్ణరాజు అసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 155 సీట్లు పక్కా అని.. రాసిపెట్టుకోండి అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. వైస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరలోకి దిగితే.. వైసీపీ ఓట్లు చీలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో 17A విషయంలో ద్విసభ్య ధర్మాసనం తీర్పును తప్పుబడుతూ కొన్ని పేపర్లు అవాస్తవాలను ప్రచురించడం బాధాకరమని అన్నారు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వంలోనే 17Aపై విచారణ జరుగుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రజా వ్యతిరేక పాలన పట్ల జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్ల సుధీర్ఘ విరామం తరువాత సొంత రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.