- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రాలో హత్య.. తెలంగాణలో మృతదేహం.. ఎవరతను?
దిశ, వెబ్‌డెస్క్ : భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. మృతదేహాన్ని రాష్ట్ర సరిహద్దులను దాటించి తెలంగాణలో పడేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన రెడ్డి కోదండ రామారావు రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై ఆయన భార్య భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావు పేట లో మృతదేహం లభ్యమైంది.
అశ్వారావు పేట మండలం అచ్చుతాపురంలోని ఓ జీడి మామిడి తోటలో కోదండ రామారావు డెడ్ బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే హతుడిని ఆంధ్రాలోనే చంపేసి.. ఆనవాళ్లు లభించకుండా తెలంగాణలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణం కావొచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
అయితే తన భర్త అదృశ్యం కాగానే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నామని వాళ్లు పట్టించుకోక పోవడం వల్లే తన భర్త హత్యకు గురయ్యాడని కోదండ రామారావు భార్య ఆరోపించారు. రొయ్యల వ్యాపారం చేస్తున్న తన భర్తపై ఇటీవల కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ నేపధ్యంలో హతమార్చి ఉంటారని ఆమె ఆరోపిస్తోంది.