- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త కూడా అలాంటివాడే అంటూ
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వాగ్ధాటికి ఎవ్వరైనా కొట్టుకుపోవాల్సిందే. స్టార్ హీరోల ఇంటర్వ్యూ అంటే సుమ లేనిదే జరగదు అనేది నమ్మదగ్గ విషయం. ఇక సుమ భర్త రాజీవ్ కనకలా గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఇద్దరు టాలీవుడ్ అడోరబుల్ కపుల్ అన్నది వాస్తవమే.. అయితే వీరి మధ్య కూడా విభేధాలు నెలకొన్నాయని, ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇక వీటిపై రాజీవ్ ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.. తామిద్దరం విడిగా ఉంటున్నది నిజమే కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. ఇక తాజాగా లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో అందరు రాజీవ్ నటనను ప్రశంసిస్తున్నారు. తాజాగా భార్య సుమ కూడా భర్త నటనను పొగుడుతూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పెద్ద పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.
“ఇటీవలే లవ్ స్టోరీ చూశాను.. వారి నటనతో మనల్ని లీనం చేసుకోగల నటులు కొంత మందే ఉంటారు. నా హబ్బీ(భర్త) రాజీవ్ కూడా అలాంటి వారిలో ఒక్కరు.. అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్ రాజీవ్.. ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్..” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమా గురించి తెలుపుతూ ” లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్.. సున్నితమైన అంశాన్ని.. ఇంకా సున్నితంగా చూపించారు శేఖర్ కమ్ముల.. నాగ చైతన్యకు హార్టీ కంగ్రాట్స్. సాయి పల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు నొప్పి పుట్టేశాయి. కళ్లు కూడా ఆర్పకుండా సాయిపల్లవి డ్యాన్స్ ను అలా చూస్తూ ఉండిపోయా. టీమ్ మొత్తానికి నా అభినందనలు అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ తో రాజీవ్- సుమ మధ్య విభేదాలు లేన్నట్టే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- love story