- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్కడిని కూడా వదలను.. వారికి యాంకర్ రవి వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా అభిమానులను మెప్పించిన యాంకర్ రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రవి సీజన్ 5లో ఉన్నప్పుడు తన భార్య, కూతురిపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ అకౌంట్‌లలో పలువురు అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు చేశాడు. సదరు అకౌంట్ హోల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టాడు.
‘ఎండ్ కోసం స్టార్ట్.. సోషల్ మీడియా అకౌంట్లలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.. వారికి కఠిన శిక్ష తప్పదు.. తప్పు మాట మాట్లాడాలి, టైప్ చేయాలని అంటేనే భయం పుట్టాలి ఇక నుంచి’ అంటూ హెచ్చరించాడు. ఇక ఈ పోస్టు చూసిన రవి ఫాలోవర్స్ తనకు మద్దతు తెలుపుతూ పలు అకౌంట్ల నుంచి ప్రచారం జరిగినట్టు రవికి సూచించగా.. ఒక్కడిని కూడా వదిలేది లేదు అంటూ యాంకర్ రవి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.