అనసూయపై నెటిజన్ అసభ్యకర ట్రోల్స్.. అంతే ఘాటు రిప్లై!

by Shyam |   ( Updated:2021-02-08 03:54:16.0  )
అనసూయపై నెటిజన్ అసభ్యకర ట్రోల్స్.. అంతే ఘాటు రిప్లై!
X

దిశ, సినిమా: జబర్దస్త్ ఫేం అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా ట్రోల్స్ కొత్తేమీ కాదు. నెటిజన్లు కామెంట్ చేయడం, అనసూయ స్పందించడం.. అవికాస్త మితిమీరితే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడం జరుగుతూనే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం తనను విమర్శించడం మానడం లేదు. తాజాగా ఓ నెటిజన్ మూడేళ్ల క్రితం వీడియో షేర్ చేసి.. కేవలం అటెన్షన్ క్యాచ్ చేసేందుకే అనసూయ కళ్లు తిరిగిపడిపోయినట్లు నాటకం ఆడిందని, ఓ అసభ్య పదజాలం ఉపయోగించి విమర్శించాడు. దీంతో ఫైర్ అయిన అనసూయ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తనకు లో బీపీ ఉందని.. 22 గంటలు నిర్విరామంగా షూటింగ్ చేయడంతో అలసిపోయి ఉ. 5.30 గంటల ప్రాంతంలో కళ్లు తిరిగిపడిపోయానని.. ఇవేవీ తెలుసుకోకుండా సింపుల్‌గా అలా ఎలా విమర్శిస్తావు? అని ప్రశ్నించింది. ‘సోషల్ మీడియాలో అటెన్షన్ క్యాచ్ చేసేందుకు ప్రయత్నించేది నేను కాదు, నువ్వు. అందుకే మూడేళ్ల క్రితం వీడియో బయటకు తీసి.. ఇప్పుడు కామెంట్ చేస్తున్నావు’ అని మండిపడింది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌ను తిట్టేందుకు సిగ్గు, భయం లాంటివి తనకేం లేవని, ఎందుకంటే ముందు మొదలుపెట్టింది అతనేనని చెప్పింది. అంతేకాదు తను కూడా అదే అసభ్యకర పదం వాడి నెటిజన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Next Story