అనన్యకు బెబో హాట్ కాంప్లిమెంట్స్

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ ఫేవరెట్ స్టార్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది.. మనకు రోల్ మోడల్ అయిన వాళ్లు స్వయంగా వచ్చి విష్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది.. మాటల్లో చెప్పలేం కదా! అదే పరిస్థితి ఎదురైంది ప్రెట్టీ గర్ల్ అనన్య పాండేకు. ప్రస్తుతం ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘కాలీ పీలీ’ సినిమాతో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్న అనన్య.. టీజర్‌తోనే ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇక తాజాగా విడుదలైన సాంగ్‌ లిరిక్స్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నా సరే.. ఆ పాటలో అనన్య లుక్‌కు పడిపోయింది బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్. ‘అనన్య చాలా హాట్‌గా కనిపిస్తున్నావ్.. వెల్ డన్’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. దీంతో ఆనందంతో గాల్లో తేలిపోతున్న అనన్య.. థాంక్యూ మై మోస్ట్ ఫేవరెట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఆల్రెడీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అనన్య.. బెబో కాంప్లిమెంట్‌తో మరింత ఉత్సాహం చూపిస్తోంది.

కాగా, ముక్బుల్ ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాలీ పీలీ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది మూవీ యూనిట్. అక్టోబర్ 2న జీప్లెక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో ఇషాన్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తుండగా.. అనన్య తన నుంచి చిన్నప్పుడు తప్పిపోయిన ఫ్రెండ్‌గా నటిస్తోంది. సినిమా సూపర్ థ్రిల్లింగ్ రైడ్‌లా ఉంటుందని.. ఇషాన్, అనన్యల కెమిస్ట్రీతో సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు ఫిల్మ్ మేకర్స్. ఆడియన్స్ ‘కాలీ పీలీ’ థ్రిల్‌ను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండాలని చెబుతున్నారు.

Advertisement