ఇంటర్నెట్‌లో అనన్య పర్సనల్ నంబర్ లీక్ .. ఆ కాల్స్‌తో సతమతం

by Shyam |
ananya pandey
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే తన సోదరి రిసా గతంలో తన ఫోన్ నంబర్ లీక్ చేసిందని తెలిపింది. యూఎస్‌లో ఉండే అనన్య కజిన్ అలన్నా యూట్యూబ్ ఇన్‌ప్ల్యూయన్సర్. చాలా కాలం తర్వాత ముంబైలో అనన్య, రిసాలను కలవగా.. ఈ మీట్‌ను తన వ్లోగ్‌ ద్వారా చూపించింది. ఈ వీడియోలో మాట్లాడిన ఈ కజిన్ సిస్టర్స్.. హీరోయిన్ అనన్య పర్సనల్ నంబర్ ఎలా లీక్ అయిందో వివరించారు. ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్న రిసా.. గతంలో షార్ట్ ఫిల్మ్ చేసిందని, దానిని యూట్యూ్బ్‌లో అప్‌లోడ్ చేసిందని తెలిపారు. అయితే ఇందులో అనన్య పర్సనల్ నంబర్ ఉందని గ్రహించని రిసా.. అలాగే వీడియో పోస్ట్ చేయడంతో తనకు అపరిచితుల నుంచి నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయని చెప్పింది అనన్య. దీంతో రిసా ఆ వీడియో డిలీట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సి వచ్చిందని ఇందుకు సంబంధించిన స్టోరీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed