‘ఆనందయ్య కంటి మందు మంచిదికాదు’

by srinivas |
‘ఆనందయ్య కంటి మందు మంచిదికాదు’
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఔషధంపై పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని పిటిషనర్లు కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ పరిశోధన చేయాలని కేంద్రానికి ఏ దరఖాస్తు రాలేదన్నారు. మరోవైపు ఆనందయ్య కంటి చుక్కల మందు ల్యాబ్‌ రిపోర్టును ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. కంటి చుక్కల మందు నిర్దిష్ట ప్రమాణాలతో లేదని రిపోర్టులు వచ్చాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది వివరించారు. 15 సంస్థల నివేదికల్లో ‘నాట్‌ గుడ్‌’ అనే ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని ఆనందయ్య తరఫు న్యాయవాది కోరారు. దీంతో కోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed