ఆ ఇద్దరు హీరోలను ప్రేమించడం నాదే తప్పు అంటున్న స్టార్ హీరోయిన్

by Shyam |   ( Updated:2023-12-17 15:21:44.0  )
sara ali khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఆనంద్ ఎల్ రాయ్ ‘అత్రంగి రే’ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ మ్యాజికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సారా అలీ ఖాన్ రింకూ పాత్రలో నటిస్తుండగా.. విష్ణుగా ధనుష్, సాజద్‌గా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో సారాను పెళ్లి చేసుకోవాలని ధనుష్ ఫ్యామిలీ అతన్ని ఫోర్స్ చేస్తుంది. కట్ చేస్తే ఇద్దరి వెడ్డింగ్ అయిపోతుంది. కానీ ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్ లేదన్న విషయం తెలుసుకుని విడిపోదామని అనుకుంటారు.

బీహార్ నుంచి ఢిల్లీ రీచ్ అయ్యాక ఎవరిదారి వారు చూసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ సడెన్ ఎంట్రీ ఇచ్చిన అక్షయ్‌‌కు, సారాకు మధ్య అప్పటికే లవ్ ట్రాక్ నడుస్తున్నా.. ఆమె ధనుష్‌తోనూ ప్రేమలో పడిపోతుంది. ఈ ట్రయాంగిల్ ప్రేమ కథలో సారా ఎవరికి దక్కుతుంది? అనేది కథ కాగా.. ట్రైలర్ లాస్ట్ సీన్‌లో ధనుష్ ఎక్స్‌ప్రెషన్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.

Advertisement

Next Story