- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ నిరుద్యోగులకు BIG అలర్ట్.. ఆ సూపర్ స్కీమ్ గైడ్‌లైన్స్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ(SC, ST, BC, Minority) యువకులకు ఆర్థిక చేయూతను ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ(Telangana Unemployed) యువతకు రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వబోతున్నారు. రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ప్రారంభం కాగా.. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్(Rajiv Yuva Vikasam Guidelines)ను ప్రభుత్వం విడుదల చేసింది.
రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు విడుదల
= రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడీ
= రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 10% మాఫీ
= రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే 20%) మాఫీ
= గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదు
= అర్బన్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 లక్షలు మించకూడదు
= నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21-55 ఏండ్ల లోపు వారు అర్హులు
= అగ్రికల్చర్ దరఖాస్తుదారులకు 60 ఏండ్లు ఏజ్ లిమిట్
= ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.50 వేల రుణాన్ని అందిస్తుంది. వీరు ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పని లేదు. అలాంటి వ్యాపారులకు నూరుశాతం రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది.