- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంత దారుణమా.. నేనెప్పుడు చూడలేదు: ఆనం
దిశ ఏపీ బ్యూరో: తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడాన్ని ఏనాడూ చూడలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించానని గుర్తు చేసిన ఆయన, జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారని విమర్శించారు. తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందడం మినహా మరే కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానన్నారు. అధికారులు సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లు అమ్ముకుంటుంటే… ప్రజల కోసం తానేమీ చేయలేకపోతున్నానని నిస్సహాయత వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు డీపీఆర్‌లు ఇచ్చామన్న ఆయన, ఇప్పుడవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని అయోమయం నెలకొందని ఆరోపించారు.